- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడంగ్ పేట్ లో ఫ్లెక్సీల కలకలం
దిశ, బడంగ్ పేట్ : రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీల ఘటన కలకలం రేపుతోంది. బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాస్ గూడ 2,3,4,5,25,26 డివిజన్లకు సంబంధించిన చప్పిడి అడివి రెడ్డి గార్డెన్స్ లో ఆదివారం జరగనున్న ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో గ్రీన్ జోన్ వెంటనే ఎత్తి వేయాలని గ్రీన్ జోన్ ఐక్య కార్యాచరణ సమితి పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి.
బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 5, 24,26,30 డివిజన్ లలో గ్రీన్ జోన్ అమలులో ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రీన్ జోన్ వెంటనే ఎత్తివేస్తామని ఇచ్చిన హామీని అమలుపచాలని, మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ తమ గ్రీన్ జోన్ సమస్యకు పరిస్కారం చూపాలని కోరుతూ గ్రీన్ జోన్ కార్యాచరణ పేరిట వెలిసిన ఫ్లెక్సీ లు కలకలం రేపుతున్నాయి.