- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం
దిశ, మర్పల్లి: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మర్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ అన్నారు. ఆదివారం మర్పల్లి మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలో జోరుగా సభ్యత్వం చేయించి నియోజకవర్గంలోనే మర్పల్లిని అగ్రగామిగా నిలుపుతామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటున్నాయని విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రసాద్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తంగేడిపల్లి గణేష్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సర్వేశ్వర్, సుధీర్, యువజన కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్, బల్వంత్ రెడ్డి, తక్కలి శివ, తులసి దాస్, రాజేందర్ గౌడ్, జి సుధాకర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.