- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ఎలాగో వేయరు..? కాస్త మట్టి అయినా పోయండి..
దిశ, పరిగి: పరిగి నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డులో నస్కల్ వంతెన వద్ద రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా దెబ్బతింది. గతంలో ఈ కోతకు గురైన రోడ్డు పై కథనాలు ప్రచురించి గత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారుల తీరులో ఇలాంటి మార్పు రాలేదు. కోతకు గురైన రోడ్డు వద్ద బైక్ ప్రమాదం జరిగి ఓ వ్యక్తి గాయాల పాలయ్యాడు. అయినా అధికారులు ఎలాంటి మార్పు రాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణం పోతే గాని స్పందించరా అంటూ ప్రయాణికులు, నస్కల్ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ కోతకు గురైన రోడ్డు వెంబడి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీపీ, ఆర్ అండ్ బి డిఇ, ఈఈలు వెళ్లిన తదితరులు వెళుతారు. అయిన కూడా కోతకు గురైన రోడ్డు పక్కన కనీసం మట్టి పోసే పరిస్థితి లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. నేడు పల్లెనిద్ర కు వస్తున్న ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అయిన ఈ కోతకు గురై ప్రమాదకరంగా మారిన రోడ్డు పక్కన కనీసం మట్టి అయినా పోయిస్తారా అని ప్రజలు, ప్రయాణికులు అనుకుంటున్నారు.