- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, షాద్ నగర్ : దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ అని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తో కలిసి షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు గదులు, ప్రహరీ, మౌలిక వసతుల కల్పన పనులకు రూ. 1.55కోట్లు, కొందుర్గు మండలం మహాదేవపూర్ లో రూ. 15 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో రూ. 2 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ సర్కార్ చేపడుతున్న సంక్షేమ పథకాలు అందని గడప రాష్ట్రంలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు అభివృద్ధి కనబడడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదతరులు పాల్గొన్నారు.