- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ ఆదేశించినా పరిగిని వీడని అంధకారం
దిశ, పరిగి: ‘అంధకారంలో పరిగి’ అనే శీర్షిక దిశ దిన పత్రికలోఈనెల 18వ తేదీన ప్రచురితమైన కథనానికి జిల్లా అధనపు కలెక్టర్రాహుల్శర్మ స్పంధించి ఆదేశాలు జారీ చేసినా సమస్యలు తీరలేదని చెప్పుకోవచ్చు. పరిగిలో హైవే రోడ్డు పొడుగునా వీధిలైట్లు లేక పాదచారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమావాస్య చీకటైనా నాలుగైదు రోజుల్లో వీడుతుంది. కానీ, అధికారులు, పాలకుల నిర్లక్ష్యపు చీకటి ఇంకా వీడటం లేదని పరిగి మున్సిపల్ప్రజలు మండిపడుతున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలో హైవే రోడ్డు పొడుగునా వీధిలైట్లకు మీటర్ కనెక్షన్తీసుకోకుండా వాడుకుంటున్నారంటూ డిస్కం ఏఈ ఖాజా బాబు విద్యుత్సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ విషమయై ఈనెల 22వ తేదీన అధనపు కలెక్టర్రాహుల్శర్మ చాంబర్లో మున్సిపాలిటీ కమిషనర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. పరిగిలో హైవే రోడ్డుపై వీధిలైట్లు సాయంత్రంలోగా వెలిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. అదనపు కలెక్టర్ఆదేశించి నాలుగు రోజులైనా పరిగిలో అంధకారం వీడలేదు. ఈ విషయమై పరిగి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ను వివరణ కోరగా హైవే వారు మున్సిపాలిటీకి వీధిలైట్ల నిర్వహన అప్పగించలేదని ఈ విషయమై స్థానికపాలకులు, హైవే కాంట్రాక్టర్ వీధిలైట్లు వెలిగేలా చూడాలని చెప్పామన్నారు. నెల రోజులుగా పరిగిలో హైవే పొడుగునా అంధకారం నెలకొని పాదచారులు రోడ్డుపై నడుస్తూ, రోడ్డు క్రాస్ చేసేట్టప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని భయభయంగా నడుస్తున్నారు. హైవే పొడుగునా అంధకారం నెలకొన్నా పాలకులకు కనువిప్పు కలుగకపోవడంమన దురదృష్టమేనని ప్రజలు అనుకుంటున్నారు.