శంషాబాద్ లో హెరాయిన్ పట్టివేత

by Kalyani |
శంషాబాద్ లో హెరాయిన్ పట్టివేత
X

దిశ, శంషాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా ఓ వ్యక్తి హెరాయిన్ వినియోగిస్తున్నారని పక్కా సమాచారంతో శంషాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అరెస్టు చేసిన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊట్ పల్లిలో చోటుచేసుకుంది. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కిషన్ గూడ ఊట్ పల్లిలోని ఓ ఇంట్లో ఓ వ్యక్తి హెరాయిన్ మత్తు పదార్థాన్ని వినియోగిస్తున్నారని పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి శంషాబాద్ పోలీస్ స్టేషన్ చెందిన ఎస్ఐ రాజ్ కుమార్ బృందం, క్లూస్ టీం తో దాడులు నిర్వహించి అంబాలాల్ సుతార్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంబాలాల్ సుతార్ గత 15 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి శంషాబాద్ మండలం ఊట్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తూ ఉండేవాడు. అయితే ఇతను గత కొంతకాలంగా రాజస్థాన్ కు చెందిన మదన్ భిష్నోయ్ లొహవత్,పరస్ జీల వద్ద హెరాయిన్ మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసి వాడుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. అంబాలాల్ సుతార్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 74 లక్షల విలువచేసే 618 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగిందన్నారు. ఇతనికి విక్రయించిన రాజస్థాన్ కు చెందిన మదన్ భిష్నోయ్ లొహవత్,పరస్ జీలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed