యుద్ధ వీరుడు అబ్దుల్ హమీద్‌పై పుస్తకాన్ని విడుదల చేసిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

by S Gopi |
యుద్ధ వీరుడు అబ్దుల్ హమీద్‌పై పుస్తకాన్ని విడుదల చేసిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం పరమవీర చక్ర గ్రహీత వీర్ అబ్దుల్ హమీద్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ప్రతి ఒక్కరూ 'అమరులే' అని అన్నారు. అబ్దుల్ హమీద్‌పై పుస్తకం విడుదల సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలోని అబ్దుల్ హమీద్ స్వగ్రామమైన ధాముపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. 1965 భారత్-పాక్ యుద్ధంలో ఖేమ్‌కరన్ సెక్టార్‌లో శత్రువులకు చెందిన అనేక ట్యాంకులను కూల్చిన తరువాత పాకిస్తాన్ దళాలతో పోరాడుతూ తన ప్రాణాలను అర్పించిన అబ్దుల్ హమీద్ జీవితం, పరాక్రమం ఆధారంగా రూపొందించిన ‘మేరే పాపా పరమ వీర్’ అనే పుస్తకాన్ని మోహన్ భగవత్ విడుదల చేశారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన హమీద్ అత్యున్నత పురస్కారానికి అర్హుడని అన్నారు. రామచంద్రన్ శ్రీనివాసన్ రాసిన ఈ పుస్తకంలో అబ్దుల్ హమీద్ జ్ఞాపకాలను, ఆయన కుమారుడు జైనుల్ హాసన్ రచయితతో పంచుకున్నారు. ఇందులో అబ్దుల్ హమీద్ బాల్యం, ఆర్మీలో అతని జీవితం గురించిన నేపథ్యంల్ ఉంది. తన తండ్రి జీవితంపై సినిమా తీయాలని ఉందని, అందుకొసం కొందరు నిర్మాతలు, దర్శకులను కూడా కలిశానని హసన్ తెలిపారు. మొదట పుస్తకం రాసి, ఆ తర్వాత సినిమా తీయాలని ఈ పుస్తక రచయిత తనకు సలహా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంగ్లీష్‌లో విడుదలైన ఈ పుస్తకాన్ని త్వరలో హిందీలోనూ తీసుకురానున్నట్టు వెల్లడించారు.

Next Story

Most Viewed