మల్కాజ్గిరి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది..

by Sumithra |
మల్కాజ్గిరి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధి అంశం పై గత నాలుగు రోజులుగా ఎంపీ ఈటెల రాజేందర్ ఢిల్లీలో ఉన్న పలు శాఖల మంత్రులతో సమావేశమై పలు కీలక అంశాల పై చర్చించారు. అనంతరం ఆయన బుధవారం ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అనేక రకాల పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉన్నాయని వీటిలో కొన్ని పరిశ్రమలు పురోగతిలో ఉండగా మరికొన్ని మూతపడ్డాయని కొన్ని ఇండస్ట్రీస్ గొప్పగా నడుస్తా ఉన్నాయి. ఐడీపీఎల్, హెచ్ఎంటి వంటి పరిశ్రమలను పునరుద్దించటం లేదా వాటి స్థానాలలో ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని పరిశ్రమల శాఖ మంత్రి కోరినట్లు పేర్కొన్నారు. జనాభా పరంగా దీన్ని దిన అభివృద్ధి చెందుతున్న మల్కాజిగిరి పార్లమెంట్ సెటిల్మెంట్ లో అదే స్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కూడా జరగాలని, చెరువులను కుంటలను కాపాడుకుంటూ వాటిని అభివృద్ధి చేయాలని అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ను కోరినట్లు తెలిపారు.

అదేవిధంగా రైల్వే శాఖ మంత్రితో భేటీ అయినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బొల్లారం ఆర్ఓబి, మల్కాజిగిరి వినాయక నగర్, నేరేడ్మెట్ లో అండర్పాస్, అల్వాల్ వెంకటాపురం నుంచి లయోలా కాలేజ్ ప్రాంతంలో ఆర్ఓబీ, ఎంఎంటీఎస్ రైల్వే లైన్ వేసిన తర్వాత నేరేడ్మెట్, అల్వాల్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మించి అక్కడ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించే విషయం పై రైల్వే శాఖ మంత్రితో చర్చించామని అందుకు ఆయన సానుకూలుగా స్పందించారని అన్నారు. అంతేకాకుండా కొంపల్లి, షామీర్పేట్ ప్రాంతాలలో నిర్మాణం అవుతున్న హైవేలు, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాలలో ఫ్లై ఓవర్, అండర్పాస్ ల అభివృద్ధిపై వేగంగా నిర్ణయం తీసుకొని చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఎక్స్ప్రెస్ హైవేలో బ్రిడ్జిస్ నిర్మాణం భాగంగానే ఎల్బీనగర్ లో అదనంగా 120 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ వేలు నిర్మాణం చేస్తా అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కరి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.గతంలో ఆర్థిక, ఆరోగ్యశాఖ, పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో పూర్తి అవగాహన ఉన్నదని , మల్కాజ్గిరి పార్లమెంట్ సిగ్మెంట్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తామని తెలియజేశారు.

Next Story

Most Viewed