ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త.. రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకుని చెంప ఛెళ్లు మనిపించిన హీరోయిన్..

by Kavitha |
ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త.. రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకుని చెంప ఛెళ్లు మనిపించిన హీరోయిన్..
X

దిశ, సినిమా: ‘షకలక బూమ్ బూమ్’ సిరీస్‌‌తో తన కెరీర్ స్టార్ట్ చేసిన జెన్నిఫర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జెన్నిఫర్ అంటే అంత గుర్తు పట్టక పోవచ్చు కానీ మాయ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ప్రేక్షకులకు అంతగా కట్టిపడేసింది మాయ పాత్రతో ఈ బ్యూటీ. ఈ పాత్రలో జెన్నిఫర్ స్టైల్, యాక్టింగ్, యాటిట్యూడ్, మేనరిజం చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ‘బేహద్’ సీరియల్లో ఆమె చేసిన యాక్టీంగ్‌ను జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే హిందీలో దిల్ మిల్ గయే, బేహాద్, కహిన్ తో హోగా, బేపన్నా వంటి సీరియల్స్‌లో నటించి చాలా పాపులర్ అయ్యింది. అలా నటిగా చాలా ఫేమస్ అయిన జెన్నిఫర్ మాత్రం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. చిన్న వయసులోనే నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరు సీరియల్ షూటింగ్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ ఏడాదికే విడాకులు తీసుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జెన్నిఫర్‌ను భర్త మోసం చేశాడని.. అతను మరో నటితో రిలేషన్‌లో ఉన్నాడని తెలిసింది. తన భర్త ప్రియురాలితో సరదాగా మాట్లాడుతుండగా.. అతడిని సెట్‌లో అందరి ముందు చెంపదెబ్బ కొట్టిందట. ఈ వార్త అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కరణ్ సింగ్ తనను మోసం చేశాడని తెలిసి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యిందట. దీంతో పెళ్లి అయిన 10 నెలల్లోనే భర్తతో విడాకులు తీసుకుంది. 2014లో భర్తతో విడిపోయిన జెన్నిఫర్ ఇప్పటికీ ఒంటరిగానే గడుపుతుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.





Advertisement

Next Story

Most Viewed