టాలీవుడ్‌లో నెం.1 హీరో అతనే.. ప్రభాస్ కూడా అతని తర్వాతే.. సురేష్ బాబు సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-05 02:06:29.0  )
టాలీవుడ్‌లో నెం.1 హీరో అతనే.. ప్రభాస్ కూడా అతని తర్వాతే.. సురేష్ బాబు సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా టాలీవుడ్‌లో నెం.1 హీరో ఎవరో చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కోక్కరిలో ఒక్కో స్పెషల్ టాలెంట్ ఉంటది. ఇక అప్పట్లో అయితే సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్స్ నెం.1 గా రాణించారు. ఆ తర్వాత జనరేషన్‌లో చిరంజీవి, వెంకటేష్, బాలక‌ృష్ణలు దూసుకుపోయారు. కానీ ప్రజెంట్ ఉన్న హీరోల్లో నెం.1 ఎవరు అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఒకప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన మూవీ 100 డేస్ ఆడితేనే ఆ మూవీ హిట్ అయినట్టు. కానీ, ఇప్పుడు అలా కాదు ఒక సినిమా సక్సెస్ అయిందని చెప్పాలంటే ఆ సినిమాకు అయిన బిజినెస్ ఎంత ఆ సినిమా సాధించిన కలెక్షన్స్ అన్ని చూసుకొని బ్రేక్ ఈవెన్ అయితే ఆ సినిమా సక్సెస్ అయినట్లు చెబుతున్నారు.

అలాగే భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాకు 200 కోట్ల గ్రాస్ పోస్టర్లు, 500 కోట్ల గ్రాస్ పోస్టర్లు ఇప్పుడు వస్తున్న ప్రతి స్టార్ హీరో సినిమాకు చాలా సాధారణంగానే కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని పోస్టర్లు వేసుకున్నా, అభిమానుల కోసం ఎన్ని రికార్డ్స్‌ని బహిర్గతం చేసినా ఆ హీరో తదుపరి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌ని బట్టి ఆ హీరో స్థాయి ఏమిటి అనేది మార్కెట్‌లో ట్రేడ్ వర్గాలకి అర్థం అయిపోతుంది. అలా ట్రేడ్‌ని దశాబ్దాలుగా దగ్గర నుండి పరిశీలిస్తున్న వారిలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు.. ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోలలో ఎవరు ఓపెనింగ్స్‌లో కింగ్ అనే విషయాన్ని తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. ‘మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి అందరికంటే భారీ ఓపెనింగ్స్ సాధించే స్టామినా ఉంది. ఆ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారికి ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌ని మించిన స్టార్ హీరో అయితే లేరు. ఆయన చిన్న డైరెక్టర్‌తో సినిమా తీసినా కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అదే పవన్.. స్టార్ డైరెక్టర్‌తో కనుక సినిమా చేస్తే ఆ కలెక్షన్స్ జోరు మనం ఊహించడానికి కూడా కష్టం, అలాంటి వసూళ్లు లభిస్తాయి. కాబట్టి ఆయనే నా దృష్టిలో నెంబర్ 1 హీరో’ అంటూ సురేష్ బాబు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed