AP Govt.: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 41 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ

by Shiva |
AP Govt.: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 41 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయాల్లో ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఐఎఫ్ఎస్ (IFS) అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Neerab Kumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా పీసీసీఎఫ్‌ (PCCF) కేడర్ అధికారుల నుంచి డీఎఫ్‌ఓ (DFO) కేడర్ అధికారులు అంతా బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న పీసీసీఎఫ్‌ (PCCF) కేడర్ అధికారులను ఇతర విభాగాలకు బదిలీ చేసింది. అదేవిధంగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న డీఎఫ్‌ఓ (DFO)ల స్థానంలో ఇతర అధికారులను రానున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ఆయిల్‌ఫెడ్, గిడ్డంగుల శాఖలో పనిచేసిన శ్రీకంఠనాథరెడ్డిని (Srikantanath Reddy) విశాఖపట్నం చీఫ్‌ కన్జర్వేటర్‌ పోస్టు నుంచి బదిలీ చేసి ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వెయిటింగ్ పెట్టింది. వెంటనే ఆయనను జీఏడీ (GAD)లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా డీఎఫ్‌ఓ (GAD)గా విధులు నిర్వర్తించిన చింతా చైతన్యకుమార్‌ రెడ్డి (Chaitanya Kumar Reddy)ని కూడా జీఏడీ (GAD)లో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో ఐఎఫ్ఎస్‌ (IFS)లు బదిలీ అవ్వడం ఇదే మొదటిసారి అని అటవీ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed