గ్లోబల్ స్టార్, మెగావారసుడు అయినా చరణ్ ఆ విషయంలో మగాడేనంట..చెర్రీపై ఉపాసన ఫీలింగ్ ఇదే!

by Jakkula Samataha |   ( Updated:2024-07-06 06:15:13.0  )
గ్లోబల్ స్టార్, మెగావారసుడు అయినా చరణ్ ఆ విషయంలో  మగాడేనంట..చెర్రీపై ఉపాసన ఫీలింగ్ ఇదే!
X

దిశ, సినిమా : మెగా వారసుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన చిరుత సినిమాతో తెలుగు అభిమానులకు పరిచయమై, మగధీరతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. ఇక ఆ తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ, పాన్ ఇండియా లెవల్‌లో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక చెర్రీ సినిమాల కోసం ఎంత టైమ్ స్పెండ్ చేస్తాడో, తన ఫ్యామిలీకి కూడా అంతే టైమ్ స్పెండ్ చేస్తూ వారితో ఆనందంగా గడుపుతారు. ఇక చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే, వీరికి పెళ్లైన పది సంవత్సరాలకు కూతురు పుట్టింది. తనకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు. బిడ్డ పుట్టి సంవత్సరం గడిచిపోయింది. అయితే ఈ హీరో ఉపాసన, తన కూతురుతో పార్టీస్‌కు వెళ్తూ చాలా సరదాగా గడుపుతాడు. అంతే కాకుండా ఉపాసన, చెర్రీలకు ఒకరంటే ఒకరు చాలా ఇష్టం, అభిమానం. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా?

ఎంత ఇష్టం ఉన్నా.. పార్టనర్‌లోని కొన్ని అలవాట్లు నచ్చవు. అలానే చెర్రీ అంటే ఉపాసనకు అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ, రామ్ చరణ్‌లోని ఆ ఒక్కటి ఉపాసనకు అస్సలే నచ్చదంట. అది ఎమిటంటే? చరణ్ ఎక్కడ వస్తువులు అక్కడే పారేసి, చిందరవందరగా ఉండటాడంట, కానీ, ఉపాసన ప్రతి ఎక్కడి వస్తువులను అక్కడే ఉంచుతుందంట. అయితే కొత్తగా పెళ్లైనప్పుడు రామ్ చరణ్ లోని అలవాటు చూసి చాలా ఇబ్బంది పడిందంట. చరణ్‌పై నెగిటివ్ ఫీలింగ్ కలిగిందంట. దీంతో ఒక రోజు చరణ్‌కు అలా ఉండకూడదు అని చెప్పడంతో ఆ అలవాటును చెర్రీ మార్చుకున్నాడంట. దీంతో రామ్ చరణ్‌పై బ్యాడ్ ఓపీనియన్ చేంజ్ అయిపోయి చాలా ఇష్టం పెరిగిపోయిందంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన తన అభిమానులు ఎంత మెగా వారసుడైనా, భార్య చెప్పిన పని చేశాడు చూడు, అసలైన మగాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed