గోల్కొండ బోనాల భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

by Prasad Jukanti |
గోల్కొండ బోనాల భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జులై 7న జరగనున్న గోల్కొండ బోనాల జాతరకు వచ్చే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా 75 స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పబోతున్నట్లు శనివారం టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికాగా పేర్కొన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్, పటాన్ చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్ సుఖ్ నగర్, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, పాత బోయిన్ పల్లి తదితర ప్రాంతాల నుంచి జాతర జరిగే గోల్కొండ కోట వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story