వాళ్లు స్వాతంత్య్ర సమరయోధులు కాదు- కళ్లుకురిచి ఘటనపై హైకోర్టులో పిల్

by Shamantha N |   ( Updated:2024-07-06 10:34:06.0  )
వాళ్లు స్వాతంత్య్ర సమరయోధులు కాదు- కళ్లుకురిచి ఘటనపై హైకోర్టులో పిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కళ్లకురిచి కల్తీ మద్యం ఘటనపై మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ పై శుక్రవారం హైకోర్టు వాదనలు వింది. కల్తీ మద్యం బాధితులు స్వాతంత్య్ర సమరయోధులు లేదా సామాజిక కార్యకర్తలు కాదని పిల్ లో గౌస్ పేర్కొన్నారు. వారు సాధారణ ప్రజల కోసం లేదా సమాజం కోసం ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు. అక్రమ మద్యం తాగి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రమాదాల బాధితులకు మాత్రమే పరిహారం ఇవ్వాలని.. ఇలా ఆనందం కోసం చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడ్డవారికి ఇవ్వొద్దని పిటిషనర్ వెల్లడించారు. బాధితులందరికీ రూ.10 లక్షల పరిహారం అందజేసే తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేయాలని పిల్ లో పేర్కొన్నారు. కల్తీమద్యం బాధితులందరికీ పరిహారం ఇవ్వడం అనేది అసమంజసమైనదని.. ఏకపక్షంగా ఉందని తెలిపారు. పరిహారాన్ని తిరస్కరించాలని.. వారిని బాధితులుగా పరిగణించవద్దని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పరిహారం మొత్తం ఎక్కువగా ఉందని తెలిపింది. రెండు వారాల తర్వాత తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed