జూలై చివరి నాటికి ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో

by S Gopi |
జూలై చివరి నాటికి ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జూలై చివరి వారంలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) రాకెట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే లాంచ్ చేస్తామని, శ్రీహరికోట, చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ఆగష్టు మొదటివారానికి పొడిగించే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 2026లో ఎస్ఎస్ఎల్వీలో ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో కీలక ఒప్పందం కలిగి ఉంది. ఢిల్లీలో జరిగిన ఇండియా స్పేస్ కాంగ్రెస్‌లో ఈ ఒప్పందం ప్రకటించారు. దాంతో 2026లో స్పేస్ మెషీన్స్ కంపెనీ రెండవ ఆప్టిమస్ అంతరిక్ష నౌకను ప్రయోగించేందుకు మార్గం సుగుమం అయింది. ఆస్ట్రేలియా రూపొందించిన అతిపెద్ద 450 కిలోల ఈ ఆప్టిమస్ అంతరిక్ష నౌకను ఎస్ఎస్ఎల్వీలో ప్రయోగించనున్నారు. ఎస్ఎస్ఎల్వీ భారత అంతరిక్ష సామథ్యానికి కీలక అడుగు. చిన్న చిన్న ఉపగ్రహాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎస్ఎస్ఎల్వీ భూమికి అతి దగ్గరగా వున్న లియో ఆర్బిట్‌లో ప్రవేశపెట్టే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌ను.. 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లనుంది.

Advertisement

Next Story

Most Viewed