మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్

by Mahesh |
మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరిత ఆవర్తనం, అల్పపీడన ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుందని తెలిపింది.. న్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని.. దీని ప్రభావం భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, మేడ్చెల్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

Next Story