విరాట్-రోహిత్‌లను భర్తీ చేయడం చాలా కష్టం! : షమీ

by Hajipasha |
విరాట్-రోహిత్‌లను భర్తీ చేయడం చాలా కష్టం! : షమీ
X

దిశ, స్పోర్ట్స్ : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్ల తర్వాత టీ 20 వరల్డ్ కప్‌ను భారత్ సాధించింది. ఇందులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఇద్దరూ టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి నిర్ణయంపై భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించారు.వారిద్దరి నిర్ణయం తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ‘టీ20ల నుంచి రోహిత్, విరాట్ కోహ్లీ తప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. భారత క్రికెట్‌ను గత 16 ఏళ్లుగా వారు పటిష్టమైన స్థితిలో ఉంచారు.పరిమిత ఓవర్లలో తమ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను ఎంతో అలరించారు. వీరిద్దరూ ఒకేసారి వీడ్కోలు పలకడం నన్ను షాక్‌‌కు గురిచేసింది. ఏదేమైనా రోహిత్, విరాట్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు.అది బీసీసీఐకు కఠిన మైన సవాల్‌తో కూడుకుని ఉంటుంది. క్రికెట్లో పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంటుంది. కానీ, వీరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. భారత్ రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించినందుకు గర్వంగా ఉంది.ఇందులో భాగమైన జట్టులోని ప్రతీ ఆటగాడికి శుభాకాంక్షలు’ అని షమీ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed