నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా

by Shamantha N |   ( Updated:2024-07-06 08:15:06.0  )
నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన నీట్‌- యూజీ 2024 పరీక్షల అవకతవకలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇలాంటి సమయంలో నీట్ యూజీ కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. శనివారం కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా..దాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కౌన్సెలింగ్ కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ ప్రకటిస్తుందని వెల్లడించింది. అయితే, నీట్ కౌన్సెలింగ్ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ..ఎన్టీఏ ఈనిర్ణయం తీసుకోవడం గమనార్హం.

సుప్రీంకోర్టులో జూలై 8న విచారణ

మే 5న దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష జరిగింది. దాదాపు 67 మందికి జాతీయస్థాయిలో తొలిర్యాంకు రావడంతో అనుమానాలు వచ్చాయి. నీట్‌ అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, నీట్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పలు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు కలిపిన వారికి రీటెస్టు నిర్వహించారు. ఆ తర్వాత సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ ప్రకటించింది. నీట్ అవకతవకలు, అక్రమాల ఆరోపణలపైన కేంద్రం, ఎన్టీఏ సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు సమర్పించాయి. నిజాయితీ ఉన్న లక్షలమంది స్టూడెంట్లు నష్టపోతారని.. నీట్ యూజీ పరీక్ష రద్దు చేయవద్దని సుప్రీంకోర్టు తెలిపింది. వీటిపైనే జులై 8న విచారణ జరగనుంది. ఇలాంటి టైంలో కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.

Advertisement

Next Story