VIRAT KOHLI: విరాట్ కోహ్లీ 10వ తరగతి సర్టిఫికెట్ వైరల్.. ఎన్ని మార్కులు వచ్చాయంటే?

by Anjali |
VIRAT KOHLI: విరాట్ కోహ్లీ 10వ తరగతి సర్టిఫికెట్ వైరల్.. ఎన్ని మార్కులు వచ్చాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వికెట్ల రారాజు క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి స్పెషల్‌గా ప్రత్యేకంగా చెప్పా్లసిన అక్కర్లేదు. దశాబ్ద కాలంగా క్రికెట్‌కు ఎనలేని సేవలందించారు. స్టేడియంలో వీరి చూడటం కోసం వేల మంది చుట్టుముడుతారు. ఇక బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా సీరియస్‌ ఉంటాడు. స్టేడియంలో కూడా తోటి ప్లేయర్లతో ఎంతో సరదాగా ఉంటారు. మనసులో ఏం దాచుకోకుండా, ఫిల్టర్స్ లేకుండా ప్రవర్తిస్తారు. అందుకే విరాట్ కోహ్లీకి కోట్లలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక రీసెంట్‌గా టీమిండియా, దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పొట్టి కప్ సొంతం చేసుకుంది. టీ 20 ప్రపంచకప్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ నిలిచారు. 76 పరుగులు తీసి రికార్డు సృష్టించారు. ఇక మ్యాచ్ అనంతరం విరాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో క్రికెట్ లవర్స్ అందరూ విరాట్ లేని మ్యాట్ ఊహించుకోలేమంటూ నిరాశ వ్యక్తం చేశారు.

ఇకపోతే తాజాగా విరాట్‌‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విరాట్ పదవ తరగతికి మార్క్ షీట్ వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్ సబ్జెక్టులో విరాట్ ఏకంగా 83 మార్కులు సాధించారు. హిందీ- 75, మ్యాథ్స్ సబ్జెక్ట్ లో 51, సైన్స్ అండ్ టెక్నాలజీ- 81, సోషల్ సైన్స్- 81 ఇంట్రోడక్టరీలో 74 మార్కులు వచ్చాయి. ఇందులో తల్లి-సరోజ్ కోహ్లీగా, తండ్రి పీఎన్ కోహ్లీ గా ఉంది. ప్రస్తుతం విరాట్ 10 వ తరగతి సర్టిఫికేట్ నెట్టింట స్ప్రెడ్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed