- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ లాంటి వాళ్లు కేసీఆర్‌ను నిలదీయాలి.. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్‌కు కాంగ్రెస్ రిప్లై
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజాభవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రాబోతున్న నేపథ్యంలో పలు విషయాలు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డితో ఒక పెద్దన్న గా వ్యవహరించండని ఇవాళ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై టీ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ రిప్లై ఇస్తూ..
‘ఘంటా చక్రపాణి గారు మీరు “మేథావులు” నాడు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లులో ఎక్కడా ఏడు మండలాలను ఏపీకి ఇవ్వాలని పొందుపరచలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాన మంత్రిగా ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ మండలాలను ఏపీకి ధారాదత్తం చేశారు. ఆ నాడు తెలంగాణ సీఎంగా ఈ విషయం పై కేసీఆర్ గుట్టు అప్పగించి చూశారు. ప్రతి చిన్న విషయానికి అగ్గి పుట్టిస్తా.. భూకంపం సృష్టిస్తా.. అని తొడలు కొట్టే కేసీఆర్.. ఏడు మండలాల విషయంలో ఏమి పుట్టించకపోగా “ఆ మండలాలు మనవి కాదు మర్చిపోండి” అని సెలవిచ్చారు. ఆనాడు మీలాంటి వారు “అట్లా అనడం తప్పు కేసీఆర్ మన మండలాలు మనకు కావాల్సిందే” అని కనీసం కేసీఆర్‌కు సలహా ఇచ్చి ఉండాల్సింది. ఇప్పటికైనా కేసీఆర్ అలా చేయడం తప్పు కేసీఆర్ మౌనం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని మీ లాంటి వాళ్లు కేసీఆర్‌ను నిలదీయాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్ చేసింది.