ట్రంపుపై క్రిమినల్ కేసు నమోదు చేయొద్దు..యూఎస్ సుప్రీంకోర్టు

by vinod kumar |
ట్రంపుపై క్రిమినల్ కేసు నమోదు చేయొద్దు..యూఎస్ సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా యూఎస్ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తీసుకున్న అనేక నిర్ణయాలపై చట్టపరమైన చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఆయన మద్దతుదారులు పార్లమెంటును ముట్టడించారు. దీనిపై పలువురు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అయితే మాజీ అధ్యక్షుడిగా తనకు మినహాయింపు ఇవ్వాలని, తనపై క్రిమినల్ కేసులు పెట్టొద్దని ట్రంప్ దిగువ కోర్టులో విజ్ఞప్తి చేయగా..దానిని కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో దిగువ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ట్రంపు తీసుకున్న చర్యలకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు చేయొద్దని తెలిపింది. కోర్టు నిర్ణయాన్ని రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి పెద్ద విజయంగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఒక అమెరికన్ గా గర్వపడుతున్నట్టు తెలిపారు.

Next Story