చంద్రబాబు రిక్వెస్ట్‌కు CM రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్..!

by Satheesh |
చంద్రబాబు రిక్వెస్ట్‌కు CM రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామని, ముఖాముఖి భేటీతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు. ఇందుకోసం ఈ నెల 6వ తేదీన ఫేస్ టూ ఫేస్ భేటీ అయ్యి ఈ అంశాలపై చర్చిద్దామని రేవంత్ రెడ్డిని చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు (మంగళవారం) తిరిగి లేఖ రాయనున్నట్లు సమాచారం. చంద్రబాబు విజ్ఞప్తికి రేవంత్ సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది.

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర విజభన అంశాలు, ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న అపరిష్కృత టాపిక్స్‌పై ఇరువురు చర్చించనున్నట్లు టాక్. కాగా, తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. రెండు స్టేట్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగా పిలుస్తుంటారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రేవంత్‌కు సీఎం పోస్ట్ దక్కగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో గురు శిష్యులు ఇద్దరూ సీఎంల హోదాలో ఫస్ట్ టైమ్ భేటీ కావడం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ మారింది.

Next Story

Most Viewed