జూన్‌లో రూ. 1.74 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం

by S Gopi |
జూన్‌లో రూ. 1.74 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాది జూన్ నెలకు సంబంధించి జీఎస్టీ ఆదాయం 7.7 శాతం పెరిగి రూ. 1.74 లక్షల కోట్లకు చేరుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఇదే నెలలో రూ. 1.61 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం నెలవారీ జీఎస్టీ వసూళ్ల డేటాను అధికారికంగా విడుదల చేయడాన్ని నిలిపివేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ తెలియరాలేదు. మొత్తం వసూళ్లలో ఐజీఎస్టీ రూ. 39,586 కోట్లు ఉండగా, సీజీఎస్టీ రూ. 33,548 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్) మధ్య జీఎస్టీ వసూళ్లు రూ. 5.57 లక్షల కోట్లుగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పన్ను వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Next Story

Most Viewed