సర్వాయి పాపన్న పోరాట పటిమ ఆదర్శం : కలెక్టర్ ప్రతీక్ జైన్

by Nagam Mallesh |
సర్వాయి పాపన్న పోరాట పటిమ ఆదర్శం : కలెక్టర్ ప్రతీక్ జైన్
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : బడుగు బలహీనవర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. సర్వాయి పాపన్న సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీతా కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడని అన్నారు. ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు, మొగల్ లు శిస్తుల రూపంలో పన్నుల వసూల్ల పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కె.ఉపేందర్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భీమరాజు, వసతి గృహ సంక్షేమ అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, వసతి గృహ సిబ్బంది, బాల, బాలికలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed