మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్తా...

by Sumithra |   ( Updated:2023-02-01 10:59:42.0  )
మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్తా...
X

దిశ, మహేశ్వరం: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి డిమాండ్ చేశారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో తన పైన నమోదైన కేసుపై బుధవారం వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం దురదృష్టకరమన్నారు.

సబితా ఇంద్రారెడ్డి వైఫ్యలాలను మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికీ తెలిసేలా గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డిని ఓడించి బీజేపీని గెలిపించుకుంటామన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాపయ్య గౌడ్, సుదర్శన్ రెడ్డి, శంకర్ రెడ్డి, మాధవచారి, వెంకటేష్ గౌడ్, ముత్యం, దేశ్యా నాయక్, శ్రీశైలం, పంతు నాయక్, ప్రకాష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed