అంగరంగ వైభవంగా సర్పంచ్ కురువ నాగార్జున సోదరుడి వివాహ వేడుకలు..

by Hamsa |   ( Updated:2023-01-28 05:51:35.0  )
అంగరంగ వైభవంగా సర్పంచ్ కురువ నాగార్జున సోదరుడి వివాహ వేడుకలు..
X

దిశ,తాండూర్ రూరల్ :వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కోటబాస్పల్లి గ్రామ సర్పంచ్ కురువ నాగార్జున సోదరుడు కురువ మహేష్, సంతోషల వివాహం శుక్రవారం నాడు తాండూరు పట్టణ శివారులోని వీర శైవ కళ్యాణమంటపములో ఈ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ మహారాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బీజేపీ సీనియర్ నాయకుడు మురళీకృష్ణ గౌడ్, నరేష్ మహారాజ్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్, తాండూరు జెడ్పిటిసి గౌడి మంజుల వెంకటేశం, పెద్దేముల్ జడ్పిటిసి దారాసింగ్, వైస్ ఎంపీపీ స్వరూప వెంకటరామిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, రవిగౌడ్, వడ్డే శ్రీనివాస్, బాల్ రెడ్డి, కరణం పురుషోత్తం రావు, ఎంపీడీవో సుదర్శన్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ్, ఆర్ఐ రాజా రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపిటిసిలు పలు శాఖల అధికారులు బంధుమిత్రులు వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story