Bathukamma : ఆ రెండు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు సపరేటు

by Kalyani |   ( Updated:2024-10-13 10:34:20.0  )
Bathukamma : ఆ రెండు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు సపరేటు
X

దిశ, తల కొండపల్లి : భారతదేశ హిందూ సంప్రదాయం ప్రపంచ దేశాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. మన తెలుగువారి యాస బాస కట్టుబాట్లు నియమ నిబంధనలు పాటించడంలో మన తెలుగువారికి ప్రత్యేక స్థానం గుర్తింపు సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినం సందర్భంగా బతుకమ్మ సంబరాలను నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాట పల్లెలు,మారుమూల గ్రామాలు అనే తారతమ్యం లేకుండా ఆడపడుచులు వైభవోపేతంగా నిర్వహిస్తారు. తొమ్మిదవ రోజు విజయదశమికి ఒక్కరోజు ముందు బతుకమ్మ సంబరాలను ముగించుకొని అనంతరం బతకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది.

కానీ రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సొంత గ్రామమైన ఖానాపూర్, అదేవిధంగా వెల్జాల్ గ్రామంలో బతుకమ్మ సంబరాలను దసరా వెళ్లి పోయిన మరుసటి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయంపై ఆయా గ్రామాల బ్రాహ్మణులు,పెద్దలను,పూర్వీకులను అడిగితే వారి నుంచి బతుకమ్మ కూడా ఒక ఆడపడుచుతో సమానమని, దసరా పండుగ పర్వదినానికి ప్రతి పుట్టింటికి ఆడపడుచులు రావడం జరుగుతుంది.

అందులో పుట్టింటికి వచ్చిన ఆడపడుచులను బతుకమ్మ వేడుకలను త్వరగా ముగించి ఎలా మళ్లీ తిరిగి పంపిస్తాము అనే ఉద్దేశంతో దసరా వేడుకలు ముగిసిన మరుసటి రోజు నిర్వహిస్తున్నట్లు, మన ఇంటికి వచ్చిన ప్రతి ఆడపడుచుకు పసుపు, కుంకుమ, చీరే, సారే ఇచ్చి (పెట్టి) పంపడం జరుగుతుందని పేర్కొంటున్నారు. వందల సంవత్సరాల క్రితం నుండి మా గ్రామాలలో మా పెద్దలు పూర్వికులు నిర్వహించిన చెప్పిన ఆచారాల ప్రకారమే సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొంటున్నారు.

Diamond Bathukamma: 101 వజ్రాలు, బంగారంతో బతుకమ్మ

Advertisement

Next Story

Most Viewed