ఏజెంట్ ఉంటేనే ఆర్టీఏ సేవలు..! అలానే రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ?

by Shiva |
ఏజెంట్ ఉంటేనే ఆర్టీఏ సేవలు..! అలానే రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఆన్‌లైన్ ​సేవలతో ప్రజలకు పౌరసేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. కానీ, ఆన్‌లైన్​ సేవలు వచ్చినా ప్రజల కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆన్​లైన్​సేవలొచ్చి ఏళ్లు గడుస్తున్నా ఫలితం లేదని స్పష్టమవుతోంది. కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వచ్చే వాహనదారులు ఏజెంట్లు లేకుండా చేసుకునే దుస్థితి లేదు. ఒకవేళ ఏజెంట్​ సహకారం లేకుండా స్లాట్ బుక్​ చేసుకొని నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వస్తే ఎక్కడ ఏ పద్ధతి అవలంభిస్తున్నారో తెలియని దమనీయ పరిస్థితి ఉంది. అంతే కాకుండా నూతన వాహనం రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వ్యక్తి ఏజెంట్​ సహాయం లేకుండా బ్రేక్​ ఇన్‌స్పెక్టర్​ వద్దకు వెళ్తే ఇంజిన్ ​నంబర్​ తీసుకునే అవకాశం ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితి స్పష్టంగా ఆర్టీఏ కార్యాలయాల్లో కనిపిస్తుంది. ఈ నెల 8న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మన్నేగూడ ఆర్టీఏ కార్యాలయంలో వింత ఘటన ఎదురైంది.

పారదర్శకత ఎక్కడ..?

ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆర్టీఏ ఆఫీస్‌లో వ్యవస్థ పని చేయడం లేదని స్పష్టమవుతోంది. ఈ సంస్థలో జరిగే 15 రకాల సేవలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అంతే కాకుండా పారదర్శకంగా సేవలు అందించాలని లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నారు. కానీ సేవలు మొత్తం ఆఫ్‌లైన్ ద్వారానే కొనసాగిస్తున్నారు. దీంతో అధికారులు, సిబ్బందికి ఏజెంట్ల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో రవాణా శాఖలో కాగిత, నగదు రహిత సేవలను అమలు చేయడంలో ఆర్టీఏ సంస్థ విఫలమతోంది. ఏ ప్రభుత్వ సంస్థల్లో కూడా ఈ స్థాయిలో అవినీతి లేదనే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలోనే ప్రప్రథమంగా ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌ మొబైల్‌యాప్‌ను, ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సుల డిజిటల్‌ పత్రాలు స్మార్ట్‌ ఫోన్‌లోనే భద్రపరచుకునే అవకాశం కల్పించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

సజావుగా స్లాట్ బుకింగ్..

ఆన్‌లైన్‌లోనే ఆర్టీఏ సేవలన్నీ నిబంధన అమలైతే ఇక నుంచి ఎవరైనా స్లాట్‌ బు కింగ్‌తోనే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లా ల్సి ఉంటుంది. రవాణా శాఖలో ఇదొక్క టే ప్రయోజనాత్మకంగా కొనసాగుతున్న ది. మిగిలిన సేవలు ఆప్రయోజనంగానే కనిపిస్తున్నాయి. ప్రతి రోజు అత్యధిక ఆదాయానిస్తున్న సంస్థ ఆర్టీఏనే. కానీ ప్రభుత్వానికి అధికారికంగా వచ్చే ఆదా యం కంటే అధికారులకు, సిబ్బందికి వచ్చే ఆదాయమే ఎక్కవగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులకే చేదు అనుభవం..

ఓ వ్యక్తి కొత్తగా రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి హయత్‌నగర్‌లోని ఓ షోరూంలో బైక్‌ను కొనుగోలు చేశాడు. అయితే రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని సంబంధిత హీరో కంపె నీ షో రూం దగ్గరికి వెళ్తే వాహనానికి సం బంధించిన పేపర్లతో పాటు స్లాట్​బుకింగ్​ చేశారు. కానీ స్లాట్​ బుకింగ్​ విషయాన్ని వినియోగదారుడికి తెలియకుండా ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉన్న ఓ ఏజెంట్‌ను కలువాలని షోరూం సిబ్బంది చెప్పారు. దీంతో వినియోగదారుడు తొందరగా బైక్​ రిజిస్ట్రేషన్​ చేస్తాడని ఆశించి ఏజెం‌ట్‌ను సంప్రదించాడు. వినియోగదారుడి నుంచి ఆధార్​‌ జిరాక్స్‌‌న షోరూం ఇచ్చిన పేపర్లతో జత చేశారు.

అనంతరం ఆ ఏజెంట్​ రూ.500 ఇవ్వాలని కోరడం‌తో వినియోగదారుడు ఇచ్చాడు. కానీ వినియోగదారు డు ఆశించిన ఆలోచనకు విరుద్ధంగా ఏజెంట్​ తెలివిగా ‘కౌంటర్​ నంబర్​ 4 వద్దకు వెళ్లండి.. నేను వస్తున్నా’ అని అని చెప్పాడు. గంటల తరబడి లైన్‌లో నిలబడినా ఫలితంలేదు. ఏజెంట్ సమీప ప్రాంతా నికి కూడా రాలేకపోయాడు. రిజిస్ట్రేషన్​ కోసం చెల్లించిన అమౌంట్​రసీదు​ఇచ్చారు. అక్కడి నుంచి కౌంటర్ ​నం బర్​ 9 వద్ద వినియోగదారుడు ఫొటో దిగిన తర్వాత ట్విస్ట్​ ఏర్పడింది. రసీద్ నుంచి ఫొటో దిగే వరకు వినియోగదారుడు సమయం వెచ్చించి కష్టపడి ప్రభుత్వ విధానాన్ని అమలు చేశారు. పై విధానం పూర్తయిన తర్వాత కొత్త వాహనాన్ని తీసుకొని వినియోగదారుడు బ్రేక్​ ఇన్‌స్పెక్టర్ వద్దకు తీసుకెళ్లాడు.

ఆ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ముందు వాహనం నిలబెడితే ‘మీ ఏజెంట్​ఎవరు? అతనిని తీసుకొని రా.. అలాగే జిరాక్స్​ పత్రాలు కావాలి’ అని కానిస్టేబుల్​ తెలివిగా వాహనం పక్కకు పెట్టించాడు. దీంతో వినియోగదారుడు జిరాక్స్​ పత్రాలు ఏమి తీసుకురావాలని కానిస్టేబుల్‌ను నిలదీశాడు. మీకు తెలియదు.. ఏజెంట్‌కు తెలుసు..తీసుకుని రావాలని మరోసారి గట్టిగా వినియోగదారుడిపై మాట్లాడారు. దీంతో వినియోగదారుడు రూ.500 తీసుకున్న ఏజెంట్​‌కు ఫోన్​చేసి గట్టిగా మాట్లాడడంతో ఎంతోమంది గంటల తరబడి ఎదురుచూస్తారు.. నువ్వు ఏమైనా మంత్రివా, సీఎంవా, ఐఏఎస్, ఐపీఎస్​ అధికారివా అంటూ వినియోగదారుడిపై దురుసుగా మాట్లాడాడు. వాస్తవంగా తనిఖీ చేయాల్సిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌కు బదులు కానిస్టేబుల్​ ఉండడం, ఏజెంట్లతో కుమ్మక్కై వ్యవహారం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన సొసైటీపై అవగాహన ఉన్న ఓ వ్యక్తికి జరిగింది. అదే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed