- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఓట్లు వేసిన చేతులకు బేడీలు వేసిన ఘనత రేవంత్ రెడ్డి దే'
దిశ, పరిగి : ఆరు గ్యారంటీల గురించి అసెంబ్లీలో చర్చ సైడ్ ట్రాక్ మళ్లించేందుకే అల్లు అర్జున్ పై అనవసర చర్చ పెట్టారంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో బుధవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే లగచర్ల కేసులో తన పై తప్పుడు కేసులు బనాయించి 37 రోజులు జైల్లో ఉంచి పైశాచిక ఆనందం పొందారన్నారు. ప్రజా సంక్షేమం అంటూ అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అంటూ అమాయక ప్రజలను ఆకట్టుకుని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓట్లు వేసిన రైతులకు బేడీలు వేయించారన్నారు. ఈ ఘనత దేశంలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డికే చెల్లిందన్నారు. తనను కూడా వాకింగ్ చేస్తూ ఉండగా ఏదో పెద్ద రౌడీని అరెస్టు చేసినట్లుగా వారెంట్ లేకుండా తీసుకు వెళ్లారన్నారు.
రిమాండ్ రిపోర్టు తాను చదవకుండానే అరెస్టు చేయించారంటూ జైలు నుంచే జడ్జికి లెటర్ పంపించాను అన్నారు. పూటకు ఓ కేసు పెట్టి ఆరు గ్యారంటీల అమలును పక్కనపెట్టి అల్లు అర్జున్ చర్చను గంటన్నర పాటు కావాలని అసెంబ్లీలో చర్చించారన్నారు. సినిమా ప్రివ్యూ షో తొక్కిసలాటలో మహిళ రేవతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమే. కానీ ఈ సంఘటనకు థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేసి చట్టరీత్యా వారి పై చర్యలు తీసుకోవాలి తప్ప అనవసరంగా అల్లు అర్జున్ ను ఇరికించడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా అరెస్టులు, కేసులు పెట్టి రైతులకు బేడీలు వేయడం మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, పీఎసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి, వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్, నాయకులు బేతు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అంతిగారి సురేందర్ కుమార్, శ్రీను, బషీర్, మౌలానా, రవి, ఎదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.