వర్షం బీభత్సం.. మోకిలాలో నీట మునిగిన గేటెడ్ కమ్యూనిటీ

by Aamani |   ( Updated:2024-09-01 14:07:54.0  )
వర్షం బీభత్సం.. మోకిలాలో నీట మునిగిన గేటెడ్ కమ్యూనిటీ
X

దిశ,శంకర్పల్లి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మోకిలా గేటెడ్ కమ్యూనిటీ విల్లా లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. శంకరపల్లి మండలం మోకిలా గ్రామంలోని లా ఫలోమా గేటెడ్ కమ్యూనిటీ విల్లా లోకి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. సుమారు 2012 విల్లాలు 1000 మంది నివాసం ఉంటున్నారు. కమ్యూనిటీలో రోడ్లపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలన్నీ నీటిలో తేలాడాయి. మోకిలా తండా ఎత్తు ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద నీరు ఉధృతంగా చేరింది. రెండు సంవత్సరాల క్రితం కూడా ఈ విల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అప్పట్లో అప్పటి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి కి ఫిర్యాదు చేయగా ఆయన ఆదేశానుసారం ఇరిగేషన్ అధికారులు తూతూ మంత్రంగా పైపులు వేసి చేతులు దులుపుకున్నారు.

భారీ వర్షాలు కురిసి నప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేశామని మా కమ్యూనిటీ నుంచి వరద నీటిని బయటకు పంపించే విధంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. లా పాలోమా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లోకి వరద నీరు వస్తుందన్న సమాచారం తెలుసుకున్న మోకిలా గ్రామ కార్యదర్శి ఎల్లయ్య సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వరద నీటిని బయటకు పోయే మార్గం గురించి సిబ్బందితో చర్చించి తాత్కాలికంగా మార్గం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ లోకి వరద నీరు వచ్చేందుకు గల కారణాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.





Advertisement

Next Story

Most Viewed