- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రోగ్రాంలో ప్రోటోకాల్ తంట.. స్టేజి పై కొట్లాట
దిశ, బషీరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గ పోరు జోరందుకుంటుంది. నువ్వెంత అంటే నువ్వెంత అని ప్రజా ప్రతినిధులు స్టేజి పైనే కొట్లాడుతున్న సంఘటనలు తాండూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది. బయటికి రా రా చూసుకుందాం అంటూ ఒకరినొకరు బహిరంగంగా విరుచుకుపడుతున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని గొట్టిగ ఖుర్దు గ్రామానికి పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమావేశంలో ఎమ్మెల్సీ వర్గానికి చెందిన గ్రామ ఉపసర్పంచ్ ను స్టేజిపై కూర్చోవడానికి కుర్చీ ఇవ్వకుండా సమావేశం కొనసాగిస్తున్నారని సర్పంచ్ స్టేజి పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో స్థానిక వైస్ ఎంపీపీ అన్నపూర్ణ భర్త అనంతయ్యకు స్థానిక సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి మధ్యన మాటల యుద్ధం పెరిగింది. స్టేజిపైనే బహిరంగంగా ఎమ్మెల్యే ముందే ఒకరినొకరు బయటికి రారా చూసుకుందామని స్టేజి నుండి బయటికి వచ్చారు. దీంతో పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమం ప్రారంభించక ముందే మధ్యలోనే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమావేశం నుండి వెనుతిరిగి వెళ్ళిపోయారు. గ్రామ పంచాయతీ ముందే ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఉపసర్పంచ్ ను లెక్కచేయకుండా స్టేజి పై కుర్చీ ఇవ్వకుండా అవమానిస్తున్నారని, ప్రోటోకాల్ పాటించకుండా సమావేశం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వర్గియులైన వైస్ ఎంపీపీ అన్నపూర్ణ భర్త అనంతయ్య పై చేయి చేసుకోవడంతో అనంతయ్య బట్టలు చిరిగాయి.