‘ఫ్యూచర్ సిటీ’కి మెట్రో, రోడ్లు.. అతిత్వరలో ఫోర్త్ సిటీ

by Y.Nagarani |
‘ఫ్యూచర్ సిటీ’కి మెట్రో, రోడ్లు.. అతిత్వరలో ఫోర్త్ సిటీ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: మహా నగరానికి అతి సమీపంలోనున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఫ్యూచర్​ సిటీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మొదట రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీఐసీసీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా రోడ్డు, మెట్రో మార్గాల ద్వారా రాకపోకలు సాగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆగస్టు నెలలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మెట్రో, బస్ రవాణా మార్గాలపై ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్​ సిటీకి రెండు మార్గాల్లో మెట్రో రైలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో 69 కి.మీ పొడవు, మూడు కారిడార్లతో మెట్రో, రెండో దశలో 78 కి.మీ మేర ఐదు కారిడార్లతో మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి దశ నిర్మాణాన్ని రెండు విభాగాలుగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

స్కిల్​యూనివర్సిటీతో ఫోర్త్​ సిటీ స్టార్ట్​..

స్కిల్ యూనివర్సిటీ నిర్మాణంలో భాగంగా రోడ్డు మార్గాలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కందుకూర్​ మండలం పరిధిలోని బేగరి కంచెలో ఫోర్త్​ ఫ్యూచర్​ సిటీ నిర్మాణం చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శంకుస్ధాపన చేసింది. ఈ సిటీలోనే అత్యధునాతన హంగులతో అన్ని రంగాల్లో పనిచేసేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని యువతకు అందించేందుకు యూనివర్సిటీని నిర్మించబోతున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల బేగరి కంచె వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి కావడానికి సమయం పడుతుందని.. అయితే ఆ వర్సిటీ నిర్మాణ పనులు ముగిసేంతవరకు తాత్కాలికంగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతోనే ఫోర్ట్​ ఫ్యూచర్ సిటీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ప్రతిపాదనలు ఇలా..

మెట్రో రైలు రెండు దశల్లో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొదటి దశలో జరిగే మెట్రో రైల్​ మార్గాన్ని రెండు విభాగాలుగా చేసి 32 కి.మీ మేర రూ.6,173 కోట్ల వ్యయంతో, మరో 32 కి.మీ మేర రూ.5,216 కోట్ల వ్యయంతో శంషాబాద్​ ఎయిర్ ​పోర్ట్​ నుంచి రావిర్యాల మీదుగా ఒకటి, శంషాబాద్​ నుంచి శ్రీశైలం రోడ్డు, తుక్కుగూడ నుంచి మరొకటి వేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బస్​ రవాణా సౌకర్యం కోసం మరో రూ.6500 కోట్ల వ్యయంతో ఆర్​ఆండ్​బీ రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు మొదటగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed