'రాజకీయం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు.. తెలంగాణలో ఉన్నది కేసీఆర్ ప్రజా సర్కార్'

by Vinod kumar |
రాజకీయం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు.. తెలంగాణలో ఉన్నది కేసీఆర్ ప్రజా సర్కార్
X

దిశ, మీర్ పేట్: మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ. 1300 ల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని బీఆర్‌ఎస్ యువ నాయకుడు కార్తీక్ రెడ్డి తెలిపారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్తీక్ రెడ్డి మాట్లాడారు. మంత్రిగారు ఏ నిధులు అయితే తీసుకొచ్చారో జీవోలతో సహా మీకు పెడుతున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యల పైన ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. 24 గంటలు పని చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. రాజకీయం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని అన్నారు. సమస్యలు తెలుసుకుంటే ప్రజలు గుర్తిస్తారని తెలిపారు.

సమాచార హక్కు చట్టం నుంచి ఎలా తీసుకోవాలో మేము సంపూర్ణ సమాచారం అందిస్తామన్నారు. బీజేపీ నాయకులు అబద్దాల పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత ఆరోపణలు మానుకొని వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. సగం వ్యాపారం సగం రాజకీయం చేస్తే ఇలానే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. సిరిసిల్ల గజ్వేల్, పేట తర్వాత జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఏది అంటే మహేశ్వరం నియోజకవర్గం అని గంటాపరంగా చెప్తారని ఆయన వివరించారు. రాష్ట్రంలో మహేశ్వరం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో ఇక్కడి రోడ్లు చెరువులు చూస్తే అర్థమవుతుందన్నారు. ఇవన్నీ అభివృద్ధి చేయడం వలనే ఇక్కడున్న స్థిరాస్తులకు విలువ పెరిగిందని ఆయన తెలియజేశారు.

ఎస్ఎన్‌డీపీ నిధుల ద్వారా 92 కోట్లతో త్వరలో పనులు పూర్తి చేయిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ. 331 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఆర్ అండ్ బి నిధుల నుంచి రూ. 432 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. 184 కోట్లతో హెచ్ఎండిఏ నిధుల గురించి ఆయన వివరించారు. మహేశ్వరం నియోజకవర్గంలో విద్యాలయాల అభివృద్ధికి రూ. 80 కోట్లను తీసుకురావడం జరిగిందని ఆయన తెలియజేశారు.

నియోజకవర్గంలో ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు. గ్రామాలలకు పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుస్తుందన్నారు. డబ్బులు ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం, డబ్బులు అయిపోగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన నాయకులకు.. రాజకీయాలు అర్థం కావన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు బేరా బాలకిషన్, అరవింద్ శర్మ, నిమ్మల నరేందర్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ముద్ద పవన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ నందీశ్వర్ రెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, బాల్ రాజ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed