కర్ణాటక సరిహద్దు వద్ద పోలీసుల నిఘా..

by Kalyani |
కర్ణాటక సరిహద్దు వద్ద పోలీసుల నిఘా..
X

దిశ, తాండూర్ రూరల్: తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతం తాండూర్ మండలం కొత్లాపూర్ వద్ద పోలీస్ లతో గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని కరణ్ కోట్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కోటి రెడ్డి, తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ ల ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని కరణ్ కోట్ ఎస్సై మధుసూదన్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం రైతులకు న్యాయం జరగాలనే ఉద్యేశంతో కొనుగోలు వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న సందర్బంగా పక్క రాష్టంలో నుంచి అక్రమంగా వరి ధాన్యం తీసుక వస్తారని అట్టి వారిని నియంత్రించాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. అలాగే కర్ణాటక రాష్టం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు 24 గంటల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కర్ణాటక తెలంగాణ ప్రాంతానికి వచ్చి పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed