కదిలించిన కథనం : అమరుడికి గుర్తింపు..

by Sumithra |
కదిలించిన కథనం : అమరుడికి గుర్తింపు..
X

దిశ, పరిగి : 'అమరుడికి అవమానం' అనే శీర్షికన 'దిశ' దినపత్రిలో శుక్రవారం వచ్చిన కథనానికి శనివారం పోలీసు శాఖ స్పంధించింది. పరిగి మండలం సుల్తాన్​ పూర్​ గ్రామంలోని ఎర్ర వాపుల విజయభాస్కర్​ రెడ్డి గ్రేహాండ్స్​ సీనియర్​ కమాండో ఇంటికి శనివారం పరిగి ఎస్సై పి.విఠల్​ రెడ్డి కదిలి వెళ్లారు. అనంతరం విజయభాస్కర్​ రెడ్డి తల్రిదండ్రులు ఎర్ర వాపుల సుశీలమ్మ–సాయిరెడ్డిలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం హైహే 163 రోడ్డు సుల్తాన్​ పూర్​ గేటు వద్ద గల గ్రేహాండ్స్​ సీనియర్​ కమాండో అమర జావాన్​ ఎర్రవాపుల విజయభాస్కర్​ రెడ్డి విగ్రహం వద్దకు ఎస్సై పి.విఠల్​ రెడ్డి తన సిబ్బంది, విజయభాస్కర్ తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు.

మొదటగా అమర వీరుడు విజయభాస్కర్​ రెడ్డి విగ్రహానికి పరిగి ఎస్సై పి. విఠల్​ రెడ్డి పూల మాలవేసి సెల్యూట్​ చేసి ఘననివాళి అర్పించారు. అనంతరం అమర జవాన్​ తల్రిదండ్రులు సాయి రెడ్డి–సుశీలమ్మను శాలువా, పూలమాలలతో సత్కరించారు. మీ కొడుకు దేశం కోసం పోరాడి చరిత్రలో అమర వీరుడుగా నిలిచాడంటూ ఎస్సై పి. విఠల్​ రెడ్డి వారికి సూచించారు. ఈ ఘననివాళి కార్యక్రమంలో కానిస్టేబుల్​ యాదోజీ, రాజు, జయవర్ధన్​, శివ కుమార్, సి.సాయిరెడ్డి, జె.వెంకటయ్య, గోవర్ధన్​ రెడ్డి, గొల్ల ఆంజనేయులు, గొల్ల నాగేష్​ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సాయిరెడ్డి, సుశీలమ్మ, శ్రీధర్​ రెడ్డి దిశ పత్రికలకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed