- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పరిగిలో విషాదం...
దిశ, పరిగి: హైవే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఓ బైకిస్ట్ఢీ కొట్టిన సంఘటనలో ఇరువుకి తీవ్రగాయాలై బైకిస్ట్ మృతిచెందాడు. పరిగి ఎస్ఐ పి. విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పూడూరు మండలం సిరిగాయపల్లి గ్రామానికి చెందిన ఇటికెని శ్యాం(18) పరిగి నుంచి స్వగ్రామమైన సిరిగాయపల్లికి గురువారం రాత్రి మోటారు సైకిల్ పై వెళ్తున్నాడు. పరిగి మండలం రంగాపూర్గ్రామ శివారులోకి రాగానే హైవే 163పై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒడిస్సాకు చెందిన సురేంద్ర తరిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న శ్యాంకు ముకానికి, తలకు తీవ్రగాయాలయ్యాయి. నడుచుకుంటూ వెళ్తున్న సురేంద్ర తరినికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే పరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఆస్పత్రులకు తరలించారు. మార్గమధ్యలో చేవెళ్ల వద్ద శ్యాం మృతిచెందినట్లు తెలిసింది. శ్యాం శ్రీసాయి పారా మెడికల్ కళాశాలలో చదువుతుండగా, సురేంద్ర తరిని సావిత్రీ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపారు.
- Tags
- rangareddy