- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్..
దిశ, యాచారం : బీఆర్ఎస్ కు యాచారం మండలంలో భారీ షాక్ తగలనుంది. యాచారం పీఏసీఎస్ మాజీ చైర్మన్ నాయిని సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ కారుడు కట్టికొమ్ముల నారాయణరెడ్డితో పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మొగుళ్లవంపు గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో శనివారం సుదర్శన్ రెడ్డి , నారాయణరెడ్డిలు తమ మద్దతుదారులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. యాచారం మండలంలోని తదితర గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులతో పాటు వైఎస్సార్ టీపీ రాష్ట్ర నాయకురాలు అమృతాసాగర్, కేసరి సాగర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలను యాచారానికి పిలిపించి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ సరైన గుర్తింపు లేకపోవడం, అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు నాయకులు తెలిపారు. త్వరలో 250 మందికి పైగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కాంగ్రెస్లో చేరనున్నట్లు నాయిని సుదర్శన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ లో ఎంతో మంది అసంతృప్తులు ఉన్నారని, ప్రతి గ్రామంలో వారిని కలిసి కాంగ్రెస్ లో చేరే విధంగా కృ షి చేస్తామని వారు తెలిపారు. యాచారం, కొత్తపల్లి గ్రామాల్లో మంచి పట్టున్న సుదర్శన్ రెడ్డి , నారాయణ రెడ్డిలు పార్టీని వీడడంతో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రెడ్డి వెంకట్రెడ్డి, కే భూపతిరెడ్డి, రెడ్డి సుధీర్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.