- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఘనంగా చండీ హోమం..లక్ష తులసి అర్చన..
దిశ, పరిగి : పరిగి మున్సిపల్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 36వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి - గిరిజాదేవి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం లక్ష తులసి అర్చన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం 108 హోమ గుండాలతో ఘనంగా ఛండీ హోమం నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ఆయన సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి - దీప్తి, జెడ్పీటీసీ దంపతులు బేతు ప్రవీణ్ కుమార్ రెడ్డి - హరిప్రియ, ఎస్పీ బాబయ్య దంపతులు, కోట్ల వెంకట్ రామకృష్ణా రెడ్డి, మంగు సంతోష్ తదితర దంపతులు చంఢీ హోమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.
వందలాదిగా భక్తులు దంపతులు లక్ష తులసీ అర్చన చంఢీ, కుంకుమార్చన, హోమంలో పాల్గొన్నారు. రెండు రోజులుగా పరిగి మున్సిపల్లో వేయినామాల వాడ వెంకటేశ్వరా.. అంటూ శ్రీమన్నారాయన సంకీర్తనలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మంత్రోచ్చరనతదో పట్టణం మారుమోగింది. నిత్యపూజ, మంగళ హారతి అభిషేకం తదితర ప్రత్యేక పూజలతో యాగాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్, మండల పార్టీ అధ్యక్షులు రొయ్యల ఆంజనేయులు, సర్పంచులు నల్క జగన్, తుల్జ్యా, బాలు, తదితరులు పాల్గొన్నారు.
రేపు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుకల పండుగగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. వేద పండితులు, పురోహితుల మంత్రోచ్చరణల నడుమ ఘనంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.