11 అయిన తెరుచుకోని ప్రభుత్వ ఆసుపత్రి.. తీవ్ర అవస్థలు పడుతోన్న రోగులు

by samatah |   ( Updated:2023-03-25 07:32:39.0  )
11 అయిన తెరుచుకోని ప్రభుత్వ ఆసుపత్రి.. తీవ్ర అవస్థలు పడుతోన్న రోగులు
X

దిశ,తలకొండపల్లి : మండలంలోని తలకొండపల్లి, గట్టు ఇప్పలపల్లి గ్రామాలలో రెండు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. శనివారం సమయం 11:30 గంటలవుతున్న ఆసుపత్రి సిబ్బంది ఎవరు కూడా రాలేదని, కనీసం తాళం కూడా తీయకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ప్రాంగణంలో ఉన్న చెట్ల కింద పడి గాపులు కాస్తున్నారు. ఈ పి హెచ్సి లో గతంలో పనిచేసిన వైద్య అధికారి బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా కనీసం 18 నెలల పాటు ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టు దర్శనమిచ్చేది.

కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీలో భాగంగా గట్టు ఇప్పలపల్లి లో కూడా నూతనంగా డాక్టర్ విధుల్లో చేరింది. జిల్లాలోనే ఈ పిహెచ్సి మారుమూల ప్రాంతం కావడంతో ఆస్పత్రిలో పనిచేసే కిందిస్థాయి అధికారులు సమయపాలన పాటించకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నమైనా ఆసుపత్రి కి తాళం వేసి ఉండడంతో గ్రామస్తులంతా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని రోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

రంగారెడ్డి జిల్లా డి ఎం హెచ్ ఓ వెంకటేశ్వరరావును దిశ వివరణ కోరగా అక్కడ విధులు నిర్వహించే డాక్టర్ 15 రోజులుగా సెలవుల్లో ఉందని, సమిగత అధికారులు సమయానికి ఎందుకు రాలేదో అడిగి తెలుసుకుంటానని వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story