17వ తేదీన జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Sumithra |
17వ తేదీన జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ, శంషాబాద్ : 17వ తేదీన జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నాయకులకు పిలుపునిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకుల సమావేశానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మెన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వేలసంఖ్యలో ప్రజలను బహిరంగ సభకు తరలించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్లు సుష్మారెడ్డి, రేఖ యాదగిరి, వైస్ చైర్మన్లు బండి గోపాల్ యాదవ్, వెంకటేష్, మేయర్ బుర్ర మహేందర్ గౌడ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్, పీఎసీఎస్ చైర్మెన్లు బుర్కుంట సతీష్, దవనాకర్ గౌడ్, నాయకులు గణేష్ గుప్త, సురేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, సురేందర్ రెడ్డి, ప్రేమ్ గౌడ్, మోహన్ రావు, హన్మంతు, శ్రీనివాస్, రాజశేఖర్ గౌడ్, దండు ఇస్తారి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story