- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
దిశ, శంషాబాద్ : తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మూడవ రోజును ఆదివారం సురక్ష దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే శంషాబాద్ డీసీపీ జోన్ పరిధిలో 50 పెట్రోలింగ్ మొబైల్ వాహనాలతో శంషాబాద్ నుండి భారీగా షాద్‌నగర్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలిని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డీసీపీ నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతిభద్రతలకు పెద్దపీట వేసి పోలీస్ శాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, అదే క్రమంలో పెట్టుబడులు పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఒక్కరోజు హైదరాబాద్ లో అల్లర్లు జరగకుండా శాంతి భద్రతలను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. మహిళల రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్ లను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోలీసులకు నూతన వాహనాలు, నూతన పోలీస్ స్టేషన్లు నిర్మించి పోలీస్ స్టేషన్ లను కార్పొరేట్ ఆఫీసులా అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేసే విధంగా అవకాశాలు కల్పించారన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగిన 100 నెంబర్ కు డయల్ చేస్తే ఐదు నిమిషాలలోపే పోలీసు వాహనం వారి వద్దకు చేరుతుందన్నారు. 24 గంటలు పట్టణాల్లో, గ్రామాలలో పోలీసులు పెట్రోలింగ్ చేయడం వల్ల గొడవలు, దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు.
అనంతరం శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ 2014 డబలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులు వ్యవస్థను బలోపేతం చేయడానికి కొత్త వాహనాలను అందించి టెక్నాలజీని పెంచారన్నారు. నేరాల నియంత్రణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు భారీగా తగ్గాయి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడంతో అవి 10 లక్షలు దాటి పోయాయి అన్నారు. ప్రమాదం జరినగిన ప్రాంతానికి కేవలం మూడు నుంచి ఐదు నిమిషాలు లోపల పోలీస్ వాహనం వెళ్లడం వెలుతుందని దానివల్ల నేరాల నియంత్రణ, రాష్ట్రంలో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఏసీపీ భాస్కర్ గౌడ్, షాద్‌నగర్ ఏసీపీ కుశాల్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్, జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్, వైస్ ఎంపీపీ నీలా మోహన్ నాయక్, కౌన్సిలర్ మేకల వెంకటేష్, నాయకులు గణేష్ గుప్త, శ్రీనివాస్ గౌడ్, నీరటీ రాజు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శ్రీధర్ కుమార్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.