- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజల రక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
దిశ, బషీరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మూడవరోజు తెలంగాణ సురక్ష దినోత్సవం సందర్బంగా బషీరాబాద్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర బషీరాబాద్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సురక్షదినోత్సవం ఉద్దేశించి రానున్న రోజులలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా తాండూర్ నియోజకవర్గంలో బస్తీబస్తీకి సీసీకెమెరాలు ఏర్పాటు చేయనున్నటు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ పోలీస్ వ్యవస్త ఉంది. మహిళా భద్రత గురుంచి షీ టీమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో పోలీసులు ప్రజలతో మమేకం అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పూడూరు ప్రియాంక, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, పాండురంగ రెడ్డి, రాజు కులకర్ణి, జయమ్మ, మధుసూదన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.