యువకుడిపై కత్తులతో దాడి.. తీవ్ర గాయాలు..!

by Nagam Mallesh |
యువకుడిపై కత్తులతో దాడి.. తీవ్ర గాయాలు..!
X

దిశ, ఆమనగల్లు(మాడుగుల): యువకుడిపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన మాడుగుల మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఆర్కపల్లి గ్రామానికి చెందిన పందుల లింగం (28) మీద అదే గ్రామానికి చెందిన జాగత్తయ్య, శుద్ధపల్లి గ్రామానికి చెందిన బాలరాజులు కత్తులతో దాడి చేసినట్లు సిఐ నాగరాజు గౌడ్ వివరించారు. కత్తులతో దాడిలో గాయపడిన లింగం బురదలో పడిపోయాడు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు లింగంను గమనించి చికిత్స నిమిత్తం పీపుల్స్ హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

Next Story