మూడు లక్షలిస్తా అమ్మేయ్ .. లేదంటే లక్ష ఇయ్యి .. మీర్ పేట మేయర్ భర్త డిమాండ్

by Sumithra |
మూడు లక్షలిస్తా అమ్మేయ్ .. లేదంటే లక్ష ఇయ్యి .. మీర్ పేట మేయర్ భర్త డిమాండ్
X

దిశ, మీర్ పేట :బాలాపూర్ మండలం, మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమనిర్మాణాలు కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి.మీర్ పేట నగరంలో ఓ స్థలం విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వివాదం చెలరేగింది. మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌ దుర్గా భర్త దీప్ లాల్ చౌహన్, బీజేపీ కార్పొరేటర్ బచ్చమోని పద్మ భర్త నర్సింహా మధ్య ముప్పై గజాల ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్డు నిర్మిస్తుండగా వివాదం మొదలైంది. మేయర్ దుర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న 15వ డివిజన్ లోని బీజేపీ క్వాటర్స్ లో కొన్నేళ్ల క్రితం పేదలకు అప్పటి ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. అయితే బీజేపీ నాయకుడు నర్సింహా ఆ స్థలంలో నిర్మాణం చేపట్టడంతో మేయర్ భర్త దీపలాల్ అడ్డుకున్నారు. దీప్ లాల్ తన అన్న కోసం ఈ స్థలాన్ని వదిలేయాలని, మూడున్నర లక్షల రూపాయలు ఇస్తానని, లేకపోతే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు నర్సింహా తెలిపారు.

ప్రతి చిన్న పనికి మేయర్ భర్త డబ్బులు డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. భార్య అధికారాన్ని ఉపయోగించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి పేదలు ముప్పై గజాల స్థలంలో నిర్మించుకుంటున్న చిన్న ఇల్లును కూల్చడమెంటని నర్సింహా అగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల సీఎం సభకు జనాలను పోగు చేయనందుకే బీజేపీ క్వాటర్స్ లో నివసిస్తున్న పేద ప్రజలపై కక్ష కట్టారని స్థానిక కాలనీవాసి, తెరాస నాయకుడు రామకృష్ణ మేయర్ భర్త దీప్ లాల్ తీరు పై మండిపడ్డారు. ముప్పై గజాల స్థలంలో నిర్మాణం అక్రమం అయినప్పుడు, ఈ స్థలానికి వంద గజాల దూరంలో నిర్మిస్తున్న మూడంతస్తుల అక్రమ భవనాన్ని ఎందుకు కూల్చడం లేదని ఆయన ద్వజమెత్తారు.

నేను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు : మేయర్ భర్త దీప్ లాల్

నర్సింహా ఒక బ్లాక్ మెయిలర్ అని, నిబంధనల మేరకే అధికారులు అక్రమ కట్టడాన్ని కూల్చివేశారని మేయర్ భర్త దీప్లాల్ అన్నారు. తాను ఇప్పటి వరకు ఎవ్వరిని డబ్బులు చేయలేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed