- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
త్వరలో మానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు రావొచ్చు : మంత్రి కేటీఆర్
దిశ, చేవెళ్ల : షాబాద్ మండలంలోని చందన్ వెళ్ళి - హైతాబాద్ లో ఉన్న వెలస్పన్ కంపెనీలో అదనంగా నిర్మించిన ఎక్స్టెన్షన్ కంపెనీని ప్రారంభించడానికి ఐటిశాఖ మంత్రి కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సి పట్నం మహేందర్ రెడ్డిలతో కలసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గుజరాత్ లో పెట్టాల్సిన యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేశారన్నారు. చందన్ వెళ్ళి, సీతారాంపూర్ గ్రామాలలో పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ వాడగా షాబాద్ ఉంటుందని, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా రావొచ్చన్నారు.
డిగ్రీ చదువుకున్న పన్నెండు వందల మందికి ఐటి సెరడ్స్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. చేవెళ్ల ప్రాంత ప్రజలు కోసం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నగర్ గూడ నుంచి 100కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు వేస్తున్నట్లు శంషాబాద్ నుంచి కూడా నాలుగు లైన్ల రోడ్డు వేస్తాం అన్నారు. తెలంగాణలో పత్తి మంచిగా ఉంటుంది. ఇక్కడ టెక్స్ టైల్ యూనిట్ ని కూడా పెట్టొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, కె.ఎస్.రత్నం, కృష్ణరెడ్డి, నాగేందర్ గౌడ్, అవినాష్ రెడ్డి, విజయలక్ష్మి రమణరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వెలస్పన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.