- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి సబితా స్పెషల్ థ్యాంక్స్
దిశ, జల్‌పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారనే, దేశంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మౌళిక సదుపాయాలు బాగా ఉంటేనే అభివృద్ధి కూడా బాగా జరుగుతుందనేది జగమెరిగిన సత్యమన్నారు. మహేశ్వరం మండలం మన్సన్‌పల్లి చౌరస్తా వద్ద రూ.కోటి 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్సీ వాణిదేవి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డిలతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేయాలనే ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, నిధులు మంజూరు త్వరగతిగా పూర్తి చేసేదిశగా అగుడులు వేస్తున్నామన్నారు.
రంగారెడ్డి, వికారాబాద్జిల్లాల్లో రూ.150 కోట్లతో రోడ్ల మరమత్తుల పనులు జరుగనున్నాయన్నారు. మార్చి లోపలే ఈ సీసీ రోడ్డు పనులన్నీ పూర్తయ్యేలా సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. శంషాబాద్ నుంచి కోళ్ళ పడకల రోడ్డు వెడల్పు విషయం కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళామని, వెంటనే స్పందించిన సీఎం రూ.22 కోట్లు మంజూరు చేశారన్నారు. మహేశ్వరం హెడ్ క్వార్టర్స్‌కు సంబంధించిన రోడ్డు వైండింగ్పనులు కొంత పెండింగ్‌లో పడిందని, ఆ పనులు కూడా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్‌అండ్‌బీకి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు రూ.35 కోట్లు, వికారాబాద్ జిల్లాకు రూ.39 కోట్లు ఈ సంవత్సరంలోనే మంజూరయ్యాయన్నారు. అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.