మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా : మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

by Sumithra |   ( Updated:2023-03-05 15:45:47.0  )
మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా : మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మీర్ పేట్ : కాలనీలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ దశలవారీగా పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని వంగ శంకరమ్మ గార్డెన్స్ లో ఆదివారం కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలనీలలో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని అన్నారు.

చెరువులను సుందరీకరణ చేయడం వలన భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కొంతమంది కబ్జాలకు గురవుతున్నావని దుష్ప్రచారం చేస్తున్నారని అని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నానని ఆమె తెలియజేశారు. కాలనీలో ముంపు సమస్య లేకుండా చేయడం జరిగిందని అన్నారు.

గతంలో వర్షాలు వస్తున్నాయంటేనే కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే వారని ప్రస్తుతం ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ముంపు సమస్యను పరిష్కరించడం జరిగిందని మంత్రి అన్నారు. కాలనీలో ఎక్కడ ఎలాంటి స్థలాలు ఉన్న అక్కడ గ్రంథాలయల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. కాలనీవాసులు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య అధ్యక్షుడు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఒంటేరు నరసింహారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, ప్రేమ్ చందర్ రెడ్డి, వెంకటయ్య, సుధాకర్ రెడ్డి, శివానందరెడ్డి, ప్రశాంత్, సుదర్శన్ రెడ్డి, సత్యం, నర్సింగరావు, వెంకట్ రెడ్డి, బాలస్వామి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story