- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా నియోజకవర్గం అంటే కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం: MLA
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. రూ.221.20కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.21 కోట్లతో చేపట్టిన ఆధిభట్ల-కొంగరకలాన్ మధ్య బ్రిడ్జి నిర్మాణానికి, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడలోని లక్ష్మీమెగా టౌన్‌షిప్ దగ్గర సీసీరోడ్లు, వాటర్ పైప్‌లైన్, వైకుంఠదామం, అండర్ గ్రౌండ్ ట్రంక్‌లైన్ పనులను ప్రారంభించారు. మాసాబ్‌చెరువు కట్టపై హెచ్‌ఎండీఏ సుందరీకరించిన పార్క్‌ను జాతికి అంకితం చేశారు. 22వ వార్డు పరిధిలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. తర్వాత బ్రాహ్మణపల్లి రోడ్డులోని సర్వే నెంబర్ 279లో తుర్కయంజాల్ మున్సిపల్ ఆఫీసు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మన్నెగూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కౌన్సిల్ మీటింగ్‌లో కాసేపు పాల్గొన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ ఆఫీసు నూతన భవనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వాస్పత్రిలో అదనపు భవనాల నిర్మాణం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నిర్మాణం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపనలు చేశారు. ఎలిమినేడు డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్డీవో ఆఫీసు, మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మంత్రులు కేటీఆర్, సబిత రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఎంతో మక్కువ ఉంటుందన్నారు. అందువల్లే ఈ నియోజకవర్గానికి విరివిగా నిధులిచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు కేటీఆర్ మరిన్ని నిధులిచ్చి అభివృద్ధికి దోహదపడాలని చేయాలని కోరారు.
సాగర్ రోడ్డు రద్దీగా మారి ప్రమాదాలు జరుగుతున్నందున రోడ్డుకు అటు ఇటు 15 ఫీట్ల చొప్పున 70 కి.మీ ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలని కేటీఆర్‌ను కిషన్‌రెడ్డి కోరారు. అలాగే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పైప్‌లైన్లు వేసేందుకు రోడ్లన్నీ ధ్వంసం చేశారని దీనికోసం రూ.15 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. పెద్ద చెరువు సుందరీకరణ పనుల కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. తుర్కయంజాల్‌లో ప్రభుత్వ ఆస్పత్రి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అనిత, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామ మల్లేశ్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్లు కప్పరి స్రవంతి, చెవుల స్వప్న, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి, కందాడ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.