ప్రధానివి పనికిమాలిన మాటలు.. మంత్రి కేటీఆర్ సీరియస్

by Disha News Web Desk |
ప్రధానివి పనికిమాలిన మాటలు.. మంత్రి కేటీఆర్ సీరియస్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఏడేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వని ప్రధాన మంత్రి మోడీ సమతా మూర్తి రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణకు వచ్చారని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. విగ్రహ ఆవిష్కరణకు వచ్చినప్పుడు తెలంగాణలో కనిపించిన పచ్చని పొలాలు, పట్టణాల అభివృద్ధి చూసి ప్రధాన మంత్రికి కడుపు మంట కలిగినట్లు ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రూ.221 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డిలతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... గుజరాత్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగెడుతున్నదని అనుకున్నాడో ఏమో... రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగం సభకు ధన్యవాదాలు చేప్పే కార్యక్రమంలో అసందర్భం లేని మాటలు పీఎం కడుపు మండి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎనిమిదేండ్ల కింద అవగాహన లేకనో, అర్ధంగాకనో మాట్లాడిండు అనుకున్నాము.. కానీ మళ్లీ ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై ప్రధాన మంత్రి విభజన ఏర్పాటు సరైన విధంగా చేయలేదని మాట్లాడటం బాధేస్తుందని కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర ఏర్పాటుకు అవమరులైన వారిని, ఉద్యమాకారులను, తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించినట్లుగా భావిస్తున్నామని అన్నారు. తల్లి బిడ్డలను వేరు చేసి తల్లిని చంపి బిడ్డనిచ్చినారని మోడీ పనికిమాలిన మాట మాట్లాడారని అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో పచ్చి అబద్ధాలు మోడీ మాట్లాడారు.. విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషం రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కడుపు మంటను బయటపెట్టారని అన్నారు. 1998లో ఇదే నరేంద్ర మోడీ పార్టీ బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఆనాడు చంద్రబాబు సంకలో చేరి కాకినాడ తీర్మానం కాకి ఎత్తుకెళ్లిందని చెప్పారని ఎద్దేవా చేశారు. భారత దేశానికి ప్రధానమంత్రి అయిన మీరు ఇంత అర్ధరహితంగా, ఇంత అవమానంగా మాట్లాడటం సమంజసమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తానన్న ఉక్కు కర్మగారం ఇవ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీ, పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదన్నారు. అదే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టు మాత్రం ఆగమేఘాల మీద పోయి జాతీయ హోదా ఇస్తారు గానీ, ఇదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే ఎనిమిదేండ్లుగా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై స్పందించని వైనం బీజేపీ ప్రభుత్వానిదని విమర్శించారు.

విద్యాసంస్థలకు గుండు సున్న...

తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క కొత్త విద్యా సంస్థను మంజూరు చేయలేదని కేటీఆర్​విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 158 మెడికల్ కాలేజీలు, 6 ఇండియన్​ఇనిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్​మెంట్, 87 నవోదయ పాఠశాలలు, 16 ఐఐఎస్​సీఆర్, 8 నేచురల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ డిజైనర్ విద్యాసంస్థలు మంజూరు చేస్తే, అందులో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది గుండుసున్న అని అన్నారు. ఎనిమిదేండ్లల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అల్లికి అల్లి సున్నకు సున్నం ఇచ్చారని అన్నారు. కొత్తగా ఏర్పాడిన రాష్ట్రానికి గుండెళ్లో సంతోషాని నింపాలి.. కానీ, గునుపాలు దింపుతున్నారని విమర్శించారు. ప్రధాన మంత్రి మొన్నటికి మొన్న మూడు నల్లా చట్టాలు తెచ్చినందుకు రైతులు సంవత్సరం పొడవునా ఉద్యమిస్తే దిక్కులేక, విధిలేక క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. దాంతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని అన్నారు. అదే పద్ధతిలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్​ డిమాండ్​చేశారు. 50 ఏళ్ల మా పోరాటాన్ని, వందలాది మంది విద్యార్థుల బలిదానాలను అవమానపర్చినందుకు క్షమాపణ చెప్పాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల తరుపున, తెలంగాణ ప్రజల తరుపు డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రగతిశీల రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో దుసుకుపోతున్న రాష్ట్రాన్ని ప్రశంసించాల్సింది పోయి అవమానిస్తావా? అని ప్రశ్నించారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల ఇవ్వాలని నీతి అయోగ్ నివేదిక పంపితే ఒక్క పైసా ఇవ్వకపోగా, అవహేళనగా మాటలు మాట్లాడటం సిగ్గుమాలిన పని అన్నారు. తెలంగాణలోని విద్యావంతులు, బుద్దిజీవులు ఆలోచించాల్సిన అవసరం వచ్చిందన్నారు. విషం పోసుకొని ఉన్న బీజేపీకి తగిన బుద్ది చెప్పాల్సిన అవసరముందన్నారు. భేటీ బచావో.. భేటీ పడావో అని చెబుతూ విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం వాళ్ల విధానమని విమర్శించారు. కేసీఆర్ రాజ్యంగాన్ని, అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్​నినాదంతోనే కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించామని మరోసారి గుర్తుచేశారు. భారతదేశంలో ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా..? కేవలం మోడీ రాసిన రాజ్యాంగమే దేశంలో నడుస్తుందని అన్నారు. ఆయన కొన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని మోడీ ఆడించే నాటకం సాగుతుందన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి వ్యవస్థలను అధిపత్యం చేసే కుట్ర దేశంలో సాగుతుందన్నారు. అందుకు నిదర్శనం పశ్చిమ బెంగాల్​రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానమన్నారు.

Advertisement

Next Story