కన్నుల విందుగా మల్లికార్జునుడి కళ్యాణోత్సవం..

by Sumithra |
కన్నుల విందుగా మల్లికార్జునుడి కళ్యాణోత్సవం..
X

దిశ, తలకొండపల్లి : మండలంలోని చెన్నారం గ్రామ సమీపంలో ఎత్తైన కొండలపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవ రోజు శనివారం నిర్వహించిన కళ్యాణోత్సవం కన్నుల విందువుగా జరిగింది. కళ్యాణోత్సవానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వహకులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం మల్లికార్జునుడి మైమరిపించే రీతిలో మల్లప్ప గుట్టపై బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులు పెద్దఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని వేద పండితులు గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజరై శివాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం నేతలు మాట్లాడుతూ జిల్లాలోని ఇంత ఎత్తైన గుట్టలపై వెలసిన దేవాలయాన్ని ఊహించని రీతిలో సుమారు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. గతంలో మల్లన్న దర్శనానికి కాలినడకనే వచ్చేవారని, ఇటీవల గుట్ట పైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం కిలోమీటర్ మేరా సీసీ రహదారి నిర్మించడంతో భక్తులు పెద్ద ఎత్తున గుట్టపైకి దర్శనానికి వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దేవాలయాల అభివృద్ధి కోసం దాతలు చాలామంది పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. పాండురంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి దంపతులు సుమారు రెండు లక్షల రూపాయలతో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అగ్నిగుండ మహోత్సవం...

గుట్టపై బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కల్యాణోత్సవం రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అగ్ని గుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. దగదగా మెరిసే నిప్పుల పైనుండి ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ భక్తులు నడుచుకుంటూ వెళ్లతారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్ పర్సన్ ఏమి రెడ్డి కౌన్సిల్య, ప్రెసిడెంట్ పాండయ్య, సెక్రెటరీ మల్లారెడ్డి, గౌరవాధ్యక్షులు పాండురంగారెడ్డి, ముఖ్య నిర్వాహకులు పెంటా రెడ్డి, నారాయణరెడ్డి, చింతలపల్లి శేఖర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లయ్య నాయక్, బద్దుల అశోక్, పర్వతాలు, సత్యనారాయణ, శ్రీకాంత్, కృష్ణయ్య, శ్రీకాంత్ రెడ్డి, లోక్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story